ఆకట్టుకుంటున్న ‘సూర్యుడివో.. చంద్రుడివో’ సాంగ్ !

Published on Dec 9, 2019 5:39 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు, అనిల్ రావిపూడిల కలయికలో రూపొందుతున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ టాకీ పార్ట్ పూర్తైన సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఈ సినిమా నుండి సెకెండ్ సాంగ్ గా ‘సూర్యుడివో..చంద్రుడివో’ సాంగ్ విడుదల అయింది. సాంగ్ ఎమోషనల్ గా సాగుతూనే సినిమాలోని ప్రధాన పాత్రల భావోద్వేగాలను చాల బలంగా ఎస్టాబ్లిష్ చేస్తోంది. సాంగ్ కూడా కీలకమైన సిచ్యుయేషన్ లోనే వచ్చేలా ఉంది. ప్రస్తుతం నెటిజన్లను ఈ సాంగ్ విపరీతంగా ఆకట్టుకుంటుంది. దేవిశ్రీ ప్రసాద్ మంచి ట్యూన్ తో సాంగ్ ను చక్కాగా తీర్చిదిద్దారు. మొత్తానికి మహేష్ బాబు పాత్ర స్వభావం, ఔన్నత్యం తెలిసేలా రామజోగయ్య శాస్త్రి ఈ పాటను రచించారు.

అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది. అలాగే సీనియర్ నటి విజయశాంతి ఒక ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. జనవరి 11న చిత్రం భారీ ఎత్తున విడుదలకానుంది.

సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సంబంధిత సమాచారం :

More