యూట్యూబ్ లో దుమ్మురేపుతున్న మహేష్ సాంగ్

Published on Dec 10, 2019 8:21 am IST

మహేష్ లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు మేనియా మొదలైపోయింది. టీజర్ విడుదల తరువాత ఈ చిత్రంపై అంచనాలు మరో స్థాయికి చేరాయి. ఇక గత సోమవారం నుండి చిత్రంలోని ఒక్కొక్క పాటను విడుదల చేస్తున్నారు. డిసెంబర్ నెలలో ఐదు సోమవారాలు ఐదు పాటలు విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా నిన్న సరిలేరు నీకెవ్వరు నుండి ‘సూర్యుడివో..చంద్రుడివో’ సాంగ్ విడుదలైంది. దేవిశ్రీ మెలోడియస్ గా ఈ పాటను స్వరపరచగా సింగర్ బి ప్రాక్ ఆహ్లాదంగా పాడారు. రామ జోగయ్య శాస్త్రి సాహిత్యం పాటకు అదనపు ఆకర్షణ అయ్యింది.

పాటను చూస్తుంటే విజయ శాంతి కుటుంబానికి అండగా వచ్చిన మహేష్ పాత్రను ఎలివేట్ చేస్తూ ఈ పాట వస్తుందని అర్థం అవుతుంది. ఇక నిన్న సాయంత్రం విడుదలైన ఈ సాంగ్ యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ దక్కించుకుంటుంది.పాట విడుదలై ఇంకా 24గంటలు కూడా గడవక ముందే రెండున్నర మిలియన్స్ వ్యూస్ కి చేరువైంది. ఈ సాంగ్ తో మహేష్ గతంలో ఉన్న యూ ట్యూబ్ రికార్డ్స్ బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తుంది. మహేష్ కి జంటగా రష్మిక మందాన నటిస్తున్న ఈ చిత్రాన్ని రామబ్రహ్మం సుంకర నిర్మిస్తుండగా దిల్ రాజు సమర్పిస్తున్నారు. 2020 జనవరి 11న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

వీడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :