రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న సుశాంత్ సినిమా!

Published on Aug 13, 2021 9:56 am IST


అక్కినేని ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి పరిచయం అయిన యంగ్ టాలెంటెడ్ హీరోల్లో సుశాంత్ కూడా ఒకడు.. కెరీర్ స్టార్ట్ లోనే మంచి హిట్స్ అందుకున్న సుశాంత్ తర్వాత గ్యాప్ ఇచ్చి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బిగ్గెస్ట్ హిట్ “అల వైకుంఠపురములో” సినిమాలో కీలక పాత్రలో కనిపించి మరో హిట్ అందుకున్నాడు. అయితే ఆ సినిమా తర్వాత సుశాంత్ నుంచి అనౌన్స్ అయ్యిన చిత్రమే “ఇచట వాహనములు నిలుపరాదు”.

దర్శకుడు ఎస్ దర్శన్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం అప్పటి నుంచి కూడా మంచి బజ్ ను నెలకొల్పుకున్నా ఈ చిత్రం ఇప్పుడు ఎట్టకేలకు రిలీజ్ అవ్వడానికి సిద్ధం అయ్యింది. మేకర్స్ ఈ చిత్రాన్ని వచ్చే ఆగష్టు 27నే రిలీజ్ చెయ్యాలని ఇప్పుడు డేట్ అనౌన్స్ చేశారు.. మరి ఈ చిత్రంలో సుశాంత్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించగా ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించాడు. అలాగే ఈ చిత్రాన్ని ఏ ఐ స్టూడియోస్ మరియు శాస్త్ర మూవీస్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :