సుశాంత్ సింగ్ అమేజింగ్ టాలెంట్..2 నిమిషాలు సింగిల్ టేక్.!

సుశాంత్ సింగ్ అమేజింగ్ టాలెంట్..2 నిమిషాలు సింగిల్ టేక్.!

Published on Jul 10, 2020 1:54 PM IST

బాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం బాలీవుడ్ లో తీరని విషాదాన్ని నెలకొల్పింది. తాను నటించిన ఆఖరు చిత్రం “దిల్ బెచారా” ట్రైలర్ ఇప్పుడు యూట్యూబ్ ను రూల్ చేస్తుండగా మరికొన్ని రోజుల్లో డైరెక్ట్ ఓటిటిలో విడుదల కానుంది.

అయితే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఎంత అమేజింగ్ టాలెంట్ కలిగిన నటుడో తన ఆఖరి చిత్రం ద్వారా మొత్తం ఫిల్మ్ లవర్స్ కి తెలిసింది. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి “దిల్ బెచారా” టైటిల్ ట్రాక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసారు. దాదాపు 2 నిమిషాల 44 సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియో సాంగ్ లో సుశాంత్ అద్భుతమైన పెర్ఫామెన్స్ కనబరిచాడు.

ఏకంగా 2 నిమిషాల 30 సెకండ్ల డాన్స్ పెర్ఫామెన్స్ ను కేవలం ఒకే ఒక్క టేక్ చేసి ఆశ్చర్య పరిచాడు. ఎక్కడా కూడా ఫ్రేమ్ మిస్సింగ్ కానీ కట్స్ కానీ ఈ వీడియోలో లేవు. జస్ట్ కెమెరా యాంగిల్ మారుస్తూనే ఈ సాంగ్ ను షూట్ చేయగా సుశాంత్ అద్భుతంగా రక్తి కట్టించాడు. దీనితో సుశాంత్ లాంటి అద్భుతమైన టాలెంట్ ఉన్న నటుడిని ఒక్క బాలీవుడ్ మాత్రమే కాకుండా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీయే మిస్సయ్యిందని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు