
అక్కినేని ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయం అయిన సుశాంత్ హీరోగా నటించిన చివరి సినిమా ‘అడ్డా’. ఆ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద సక్సెస్ అయినా తన నెక్స్ట్ సినిమా చెయ్యడానికి రెండేళ్ళు పట్టింది. మంచి కథ కోసం ఇన్ని రోజులు ఎదురు చూసిన సుశాంత్ జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇటీవలే ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరబాద్ లో జరుగుతోంది. ఈ సినిమాలో సుశాంత్ తో రొమాన్స్ చెయ్యడానికి ఓ పంజాబీ ముద్దుగుమ్మని సెలక్ట్ చేసారు.
ఇటీవలే వైభవ్ హీరోగా వచ్చిన తమిళ డబ్బింగ్ మూవీ ‘పాండవుల్లో ఒకడు’ సినిమాతో పరిచయమైన సోనమ్ బజ్వాని సుశాంత్ సినిమాకి హీరోయిన్ గా ఫైనలైజ్ చేసారు. పంజాబీ సినిమాతో హీరోయిన్ గా మారిన సోనమ్ బజ్వాకి ఇది తొలి తెలుగు ప్రాజెక్ట్. త్వరలోనే ఈ భాషం సుశాంత్ తో పాటు షూటింగ్ లో జాయిన్ అవ్వనుంది. నాగ సుశీల – చింతలపూడి శ్రీనివాసరావు నిర్మిస్తున్న ఈ సినిమాకి ‘ఆటాడుకుందాం రా’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు.

