“పుష్ప” సస్పెన్స్ కి తెర దించేసారుగా.!

Published on May 12, 2021 10:30 am IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “పుష్ప”. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియన్ చిత్రంపై భారీ అంచనాలు కూడా ఉన్నాయి. అయితే గత కొన్ని రోజులు నుంచి ఈ చిత్రం పై ఓ ఇంట్రెస్టింగ్ గాసిప్ ఊహించని విధంగా మొదలయ్యింది. అదే ఈ సినిమా ఒక్క భాగంగా కాకుండా రెండు భాగాలుగా విడుదల చేస్తారని.

మరి దీనితో అక్కడ నుంచి అది నిజమేనా కాదా అన్న సస్పెన్సు మొదలయ్యింది. అయితే సినీ వర్గాల సమాచారం ప్రకారం అది ఆల్ మోస్ట్ నిజమే అని తెలిసింది. కానీ పుష్ప కాంపౌండ్ నుంచి కూడా ఒక క్లారిటీ వస్తే అంతా క్లియర్ అవుతుంది అనుకున్న వారు కూడా ఉన్నారు. మరి వారి సస్పెన్స్ కు ఈ చిత్ర నిర్మాతలలో ఒకరైన రవి శంకర్ తెర దించేశారు.

ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పుష్ప కథకు ఉన్న స్పాన్ కి ఒక్క పార్ట్ లో చెప్పడం కుదరదు అని అందుకే దర్శకుడు సుకుమార్ మళ్ళీ ఓ సారి చర్చించి దీనిని రెండు పార్ట్స్ గా చెయ్యాలని ఫిక్స్ చేసాం అని కన్ఫర్మ్ చేసారు. సో ఈ మోస్ట్ అవైటెడ్ చిత్రం రెండు భాగాలుగా రావడం కన్ఫర్మ్ అయ్యిందని చెప్పాలి. మరి సుకుమార్ ఈ కథను ఎంత స్ట్రాంగ్ గా నరేట్ చేయనున్నారో చూడాలి.

సంబంధిత సమాచారం :