సువర్ణసుందరి ట్రైలర్ టాక్: గతం భవిష్యత్తును వెంటాడుతుంది

Published on May 20, 2019 12:04 pm IST

.jpg” alt=”” width=”500″ height=”235″ />

సస్పెన్స్ మరియు హారర్ థ్రిల్లర్ జోనర్ లో సీనియర్ హీరోయిన్ జయప్రద, పూర్ణ, సాక్షి చౌదరి ప్రధాన తారాగణం గా తెరకెక్కుతున్న మూవీ “సువర్ణసుందరి”. మూవీ ప్రమోషన్ లో భాగంగా చిత్ర యూనిట్ నేడు ప్రీరిలీజ్ ట్రైలర్ ని విడుదల చేశారు. ఉత్కంఠ రేపే సన్నివేశాలతో పాటు, గ్రాండ్ విజువల్స్ తో కూడిన ట్రయిలర్ సినిమాపై అంచనాలను పెంచేలా ఉంది.
ఇది భిన్న తరాల మధ్య నడిచే రివెంజ్ డ్రామాగా ఉంటుందని విజువల్స్ చూస్తే అర్థం అవుతుంది. ఒకతరం నాటి సువర్ణసుందరి తనకు జరిగిన అన్యాయానికి ప్రతీకారంగా ప్రస్తుత కాలానికి ఎలా వచ్చింది. వారిపై పగ ఎలా తీర్చుకుంది అన్నదే కథాంశం అని తోస్తుంది. సువర్ణసుందరి వలన ప్రాణాలు కోల్పోతున్న వారి కి సంబందించిన కేసు ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా సాయి కుమార్ కనిపిస్తున్నారు. కథ మొత్తం సువర్ణసుందరికి చెందిన ఓ చిన్న బంగారు విగ్రహం చుట్టూ తిరుగుతుందనిపిస్తుంది. ఏది ఏమైనా ట్రైలర్ లో విజువల్స్, చిత్రీకరించిన తీరు చూస్తుంటే తప్పకుండా మూవీ ప్రేక్షకులకు ఓ మంచి అనుభూతిని పంచుతుంది అవుతుందనిపిస్తుంది.
సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు,సాయి కుమార్ , నాగినీడు, ఇంద్ర,ముక్తార్ కహాన్, సత్య ప్రకాష్, అవినాష్, ఇంద్ర ముఖ్యతారాగణంగా చేస్తున్న ఈ మూవీ ని ఎం.ఎస్.ఎన్ సూర్య దర్సకత్వం వహిస్తుండగా, ఎం.ఎల్ లక్ష్మి ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నారు. మ్యూజిక్ సాయి కార్తీక్, డి ఓ పి ఎల్లుమంటి ఈ, ఎడిటర్ ప్రవీణ్, పి ఆర్ ఓ సాయి సతీష్. వేసవి కానుకగా ఈ నెల 31 విడుదల కానుంది.

వీడియో కోసం క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :

More