‘సువర్ణసుందరి’ విడుదలకు సిద్ధం !

Published on May 1, 2019 7:17 pm IST

సూర్య ఎంఎస్ఎన్ ద‌ర్శ‌క‌త్వంలో ప్రఖ్యాత నటీమణి జయప్రద కీలకపాత్రలో తెరకెక్కుతున్న సినిమా “సువర్ణసుందరి”. పునర్జన్మల నేపధ్యంలో రానున్న ఈ చిత్రం విడుదల తేదీని ఖరారు చేసుకుంది. ‘మే’ 31వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. శ్రీ కృష్ణ దేవ‌రాయ‌ల స్టోరీ ఆధారంగా తెర‌కెక్కిన ఈ చిత్రంలో జయప్రదతో పాటు హీరోయిన్ పూర్ణ కూడా ప్రధాన పాత్రను పోషించింది.

మొత్తానికి ‘చ‌రిత్ర భ‌విష్య‌త్‌ ని వెంటాడుతోంది అనే ఆసక్తికరమైన ట్యాగ్ లైన్‌ తో విజువ‌ల్ ఫీస్ట్‌ గా ఈ మూవీ రాబోతుంది. ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీత బాణీలు సమకూరుస్తుండగా నాగినీడు, కోట శ్రీనివాసరావు, ముక్తార్‌ ఖాన్ లాంటి ప్రముఖ నటులు ఇతర ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్.టీమ్ పిక్చర్స్ పతాకం పై ఎమ్.ఎల్. లక్ష్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More