చిరుతో అప్పట్లోనే అడ్వాన్స్డ్ మూవీ ఎలా ఆగిపోయింది?

Published on Sep 30, 2020 8:11 pm IST


ఏ ఇతర ఇండస్ట్రీలలో లేని విధంగా యమ ధర్మరాజు బ్యాక్ డ్రాప్ లో ఉన్న సినిమాలు మన టాలీవుడ్ లోనే అత్యధికంగా ఉన్నాయి. పైగా ఆ జానర్ లో వచ్చిన ప్రతీ సినిమా కూడా సూపర్బ్ ఎంటర్టైనర్ గా నిలిచింది. అయితే టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి కూడా “యముడికి మొగుడు” అనే అలాంటి తరహా చిత్రంలో నటించి ఆల్ టైం రికార్డులను నెలకొల్పారు.

అలా సమయంలో కమెడియన్ ఆలీతో మల్టీ టాలెంటెడ్ దర్శకుడు ఎస్వీ కృష్ణా రెడ్డి తీసిన మరో వండర్ “యమలీల”. ఆ టైం లోనే ఎన్నో వండర్స్ తీసిన ఈ దర్శకుడు మెగాస్టార్ తో కూడా ఒక ప్రాజెక్ట్ ను ప్లాన్ చేసారని ఈటీవీ ఛానెల్లో ప్రసారం అయ్యే “ఆలీతో సరదాగా” షోలో వెల్లడించారు. కానీ ఆ సమయంలో ఈ ప్రాజెక్ట్ అనూహ్యంగా ఆగిపోయిందని దానికి కారణం కూడా చెప్పారు. ఆ సమయంలోనే చిరుతో అడ్వాన్స్ టెక్నాలిజీతో ప్లాన్ చేశామని కానీ అప్పట్లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో అని తీయలేదని ఈ ఇంటర్వ్యూ ద్వారా తెలిపారు.

సంబంధిత సమాచారం :

More