మహేష్ ‘సర్కారు’ ఫస్ట్ నోటీస్ కి లక్ష లైక్స్ !

Published on Aug 2, 2021 5:10 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రానున్న ‘సర్కారు వారి పాట’ సినిమా నుండి ఫస్ట్ నోటీసు అంటూ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ లైక్స్ అండ్ షేర్ లతో ట్రెండ్ సెట్ చేస్తూ సరికొత్త రికార్డ్స్ ను క్రియేట్ చేస్తోంది. ఇప్పటి వరకు ట్విట్టర్ లో ఫాస్ట్ గా ఎక్కువ లైక్స్ అనగా లక్షకు పైగా లైక్స్ ను సొంతం చేసుకున్న పోస్టర్ గా రికార్డ్ ను సెట్ చేసింది.

అలాగే ఈ పోస్టర్ ఎక్కువ రీట్వీట్స్ అనగా 50 వేల రీట్వీట్స్ తో మరో రికార్డ్ ను సెట్ చేసింది. ఇక ఆగస్టు 9వ తేదీన మహేష్ బాబు పుట్టిన రోజు ఉండటంతో చిత్ర యూనిట్ ఆ రోజున స్పెషల్ టీజర్ ను ప్లాన్ చేస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, జీ ఎమ్ బి ఎంటర్టైన్మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు ఈ మూవీని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి. భారత బ్యాంకింగ్ రంగాన్ని కదిలించిన భారీ కుంభకోణాల చుట్టూ ఈ సినిమా సాగుతోంది.

సంబంధిత సమాచారం :