కలర్స్ ప్రోగ్రాం తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన స్వాతి ఆ తర్వాత హీరోయిన్ గా ఫేమస్ అయినప్పటికీ తనని చాలా మంది కలర్స్ స్వాతిగానే పిలుచుకుంటారు. కానే ఇప్పుడు తను ఆ ఇమేజ్ ని పూర్తిగా దూరం చేసుకొని సక్సెస్ఫుల్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.
హీరోయిన్ గా తన కెరీర్ని ప్రారంభించినప్పుడు మొదట్లో ఒకటి రెండు హిట్స్ అందుకున్నా అవి తన కెరీర్ కి పెద్దగా హెల్ప్ కాలేదనే చెప్పాలి. కానీ స్వామీ రారా, కార్తికేయ సినిమాలతో వరుసగా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంది. దాంతో స్వాతికి ఆఫర్స్ మీద ఆఫర్స్ వస్తున్నాయి. ప్రస్తుతం స్వాతికి తెలుగు మరియు తమిళ బాషల నుంచి వరుస ఆఫర్స్ వస్తున్నాయి. ఇండస్ట్రీలో ఒక్క హిట్ వస్తే వాళ్ళ లక్ మొత్తం మారిపోతుంది. అలాంటి అవకాశాన్ని ప్రస్తుతం స్వాతి దక్కించుకుంది. మరి ఎలాంటి సినిమాలతో మనముందుకు వస్తుందో చూడాలి.


