
అచ్చ తెలుగు తెలుగమ్మాయి అయిన ‘కలర్స్’ స్వాతి ‘నార్త్ 24 కాతం’ అనే మళయాళ సినిమాకి సైన్ చేసింది. స్వాతికి ఇది రెండవ మళయాళ సినిమా. కొద్ది రోజుల క్రితం పృథ్వి రాజ్ హీరోగా నటిస్తున్న ‘లండన్ బ్రిడ్జి’ అనే సినిమాకి స్వాతిని హీరోయిన్ గా ఎంచుకున్నారు కానీ ఆమెకి డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఆ ఆఫర్ ఆండ్రియా జేరెమియా కి వెళ్ళింది. అనుకోని విధంగా ‘నార్త్ 24 కాతం’ సినిమాకి ముందుగా ఆండ్రియాని అనుకున్నారు కానీ ఆమెకి కి డేట్స్ ఇబ్బంది రావడంతో అదే రోల్ చేసే అవకాశం స్వాతిని వరించింది. ఈ సినిమాలో తను మలయాళంలో చేసిన మొదటి సినిమాలో జోడీ కట్టిన ఫహద్ ఫసిల్ తోనే మరో సారి జోడీ కడుతుండడం విశేషం. అనిల్ రాధాకృష్ణన్ నాయర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. స్వాతి ప్రస్తుతం తమిళ్ లో ‘ఇదార్ఖుతానే ఆసైపట్టై బాలకుమర’ సినిమాలోనూ, తెలుగులో నవదీప్ సరసన ‘బంగారు కోడిపెట్ట’ సినిమాలో నటిస్తోంది.
మరో మలయాళం సినిమాలో మెరవనున్న స్వాతి
మరో మలయాళం సినిమాలో మెరవనున్న స్వాతి
Published on May 5, 2013 7:00 PM IST
సంబంధిత సమాచారం
- గంటలో లక్ష టికెట్ల అమ్మకం.. ‘టాక్సిక్’ తుఫానుకు అల్లాడుతున్న బాక్సాఫీస్..!
- టాక్సిక్ ఎఫెక్ట్ : రవితేజ సొంత థియేటర్లో ‘ఇరుముడి’ కంటే ఎక్కువ షోలు..!
- ట్రైలర్ టాక్ : యూత్‌ఫుల్ రైడ్‌ను సిద్ధం చేసిన ‘రోమాంచకం’
- మాస్ రాజా ర్యాంపేజ్.. వంద కోట్ల క్లబ్‌లోకి రవితేజ ‘ఇరుముడి’
- మహేష్ బాబుతో నెక్స్ట్ మూవీ.. క్లారిటీ ఇచ్చిన అనిల్ రావిపూడి..!
- ‘జై హనుమాన్’, ‘మహాకాళి’ ఓకే.. ఆ సూపర్ హీరో సినిమా ఏమయ్యాడు?
- ‘ఇరుముడి’పై రష్మిక ఎమోషనల్ పోస్ట్.. చెప్పుకోలేనిది చెప్పారు!
- పోల్ : యష్ ‘టాక్సిక్’ డే1 వరల్డ్‌వైడ్ కలెక్షన్స్ ఎంత ఉండొచ్చు..?
- ‘ఇరుముడి’ తర్వాత ‘దాగుడు మూతల దండాకోర్’ అంటున్న రవితేజ.. అసలు సంగతి ఏమిటంటే..?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- బన్నీ ‘రాకా’ పై మరో క్రేజీ రూమర్ ?
- రవితేజ ‘ఇరుముడి’ బాక్సాఫీస్ ర్యాంపేజ్: 3 రోజుల్లోనే రూ.30 కోట్ల షేర్ వసూళ్లు!
- నైజాంలో రవితేజ జోరు.. 3 రోజుల్లోనే భారీ వసూళ్లు !
- స్వామి శరణం: నైజాంలో “ఇరుముడి” సెన్సేషన్.. వర్కింగ్ డేలో కూడా ట్రేడ్ షాకయ్యే వసూళ్లు!
- NBK111 కోసం రెండు టైటిల్స్..?
- ట్రైలర్ టాక్ : ఫుల్ ఎనర్టైన్మెంట్ తో ‘రంభ ఊర్వశి మేనక’
- ‘రాకా’లోకి మరో భామ రాక.. ఎవరంటే..?
- ‘ఇరుముడి’కి టాక్సిక్ డేంజర్ బెల్స్.. సగానికి పైగా లాగేస్తుందా..?

