సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ విధ్వంసం.. ‘స్వయంభు’ టీజర్‌తో నిఖిల్ సిద్ధార్థ్ సంచలనం!

సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ విధ్వంసం.. ‘స్వయంభు’ టీజర్‌తో నిఖిల్ సిద్ధార్థ్ సంచలనం!

Published on Feb 11, 2026 11:46 AM IST

Swayambhu

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ లీడ్ రోల్‌లో నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా చిత్రం ‘స్వయంభు’ ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ హైప్ క్రియేట్ చేసింది. ఈ చిత్రాన్ని భరత్ కృష్ణమాచారి డైరెక్ట్ చేస్తుండగా భారీ బడ్జెత్‌తో ఈ సినిమాను విజువల్ వండర్‌గా రూపొందిస్తున్నారు. ఇక ఈ సినిమా నుండి తాజాగా టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.

‘స్వయంభు’ టీజర్ ఆద్యంతం స్టన్నింగ్ విజువల్స్‌తో అదిరిపోయే విధంగా కట్ చేశారు. భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లనున్నట్లు ఈ టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఇక జానపద కథాంశంగా తెరకెక్కిన ఈ సినిమాలో నిఖిల్ తన బెస్ట్ పెర్ఫార్మెన్స్‌ను ఇవ్వనున్నాడు. అదిరిపోయే వార్ ఎపిసోడ్స్, ఆకట్టుకునే గ్రాఫిక్స్‌తో ఈ సినిమా ప్రేక్షకులకు అదిరిపోయే ట్రీట్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

ఈ టీజర్‌లో కొన్ని ఇంట్రెస్టింగ్ డైలాగులు కూడా ఆకట్టకుంటున్నాయి. కేవలం హీరో మాత్రమే కాకుండా మిగతా నటీనటులు కూడా ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేస్తున్నారు. వారి నుంచి కూడా కొన్ని డైలాగులు రావడం విశేషం. సంయుక్త మీనన్, నభా నటేష్, సుబ్బరాజు తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారీ క్యాస్టింగ్‌తో ఈ సినిమా ప్రేక్షకులను థ్రిల్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇక రవి బస్రూర్ అందించిన స్టన్నింగ్ మ్యూజిక్ ఈ సినిమాకు మేజర్ అసెట్‌గా నిలవబోతుంది. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాను గ్రాండియర్‌గా చూపెట్టనుంది. ఈ సినిమాను ఠాగూర్ మధు సమర్పణలో భువన్, శ్రీకర్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు