చిరంజీవిగారితో పని చేశాక, నేను పూర్తిగా మారిపోయాను – సురేందర్‌ రెడ్డి

Published on Sep 9, 2018 5:18 pm IST


‘కళ్యాణ్ రామ్’తో తన కెరీర్ ను మొదలుపెట్టిన దర్శకుడు సురేందర్‌ రెడ్డి, ఇప్పుడు ఏకంగా మెగాస్టార్‌ చిరంజీవినే డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. కాగా సురేందర్‌ రెడ్డి, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రాన్ని శరవేగంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో చాలా సన్నివేశాలను సురేంద్ర రెడ్డి చాలా ప్రత్యేకంగా చిత్రీకరించారట. ఇటీవలే మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సురేంద్ర రెడ్డి సైరా చిత్రం ద్వారా చిరంజీవితో కలిసి పని చేశాక తన జీవితాన్ని పూర్తిగా ఎలా మార్చుకున్నాడో వెల్లడించాడు.

“నా అలవాట్లు, అభిరుచులు మరియు ఆసక్తి మొత్తం చేంజ్ అయ్యాయి. మెగాస్టార్ చిరంజీవిగారు వ్యక్తిత్వం ఒక పుస్తకంలా ఉంది. ఆయనతో మరింత సమయం కలిసి పని చెయ్యాలని, మరింత ప్రయాణం చేయాలనుకుంటున్నానని తెలిపాడు. ఇంకా సురేంద్ర రెడ్డి మాట్లాడుతూ.. నేనిప్పుడు ఏకంగా మెగాస్టార్ నే డైరెక్ట్ చేస్తుంటే అస్సలు నమ్మలేకపోతున్నానని తెలిపాడు.

సంబంధిత సమాచారం :