రేపటి నుండి అమెజాన్‌ ప్రైమ్‌ లో సైరా’ !

Published on Nov 20, 2019 11:00 pm IST

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా’ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. స్వాతంత్ర్యం కోసం తొలి సమరం ప్రారంభించిన వీరుడి కథ కావడం, ఆ పోరాటం కోసం ప్రాణాల్నే అర్పించడంతో ‘సైరా’ చిత్రం ఒక దేశభక్తుడి చిత్రంగా పేరు తెచ్చుకుంది. సినిమా చూసిన అందరూ కూడా తప్పక చూడాల్సిన చిత్రం అని మెచ్చుకున్నారు. కాగా ఈ నెల 21వ తేదీ నుండి ఈ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌ లో హెచ్‌డీ ప్రింట్‌ తో అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ప్రకటించింది.

ఈ సందర్భంగా సైరా తమిళ్‌, తెలుగు, కన్నడ, మళయాళం వెర్షన్లను ఆన్‌ లైన్‌లో వీక్షించవచ్చని పేర్కొంది. హిందీ వెర్షన్‌ త్వరలోనే ఆన్‌ లైన్‌లో అందుబాటులోకి వస్తుందని పేర్కొంది. ఇక బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ మెగాస్టార్ చిరంజీవి కోసం సైరా చిత్రంలో నరసింహారెడ్డి గురువు గోసాయి వెంకన్నగా కనిపించారు. అలాగే ఈ సినిమాలో సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, అనుష్క వంటి స్టార్ లు కూడా నటించారు. ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటించింది.

సంబంధిత సమాచారం :