మెగాస్టార్ ‘సైరా’ షూటింగ్ అప్ డేట్ !

Published on Feb 25, 2019 5:02 pm IST

సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. అయితే చిత్రబృందం కొన్ని సన్నివేశాలను బీదర్ లో వారం రోజులు పాటు షూట్ చేయడం కోసం, అక్కడ అన్ని పర్మిషన్లు తీసుకోని వెళ్లినా.. అక్కడ నివసిస్తోన్న ప్రజల్లో కొంతమంది మా ఏరియాలో షూట్ చెయ్యొద్దు అంటూ అభ్యంతరం చెప్పారు.

దాంతో చిత్రబృందం ఇక హైదరాబాద్ కోకాపేట్ లో వేసిన ఓ భారీ సెట్ లో షూట్ చెయ్యాలని నిర్ణయించుకున్నారు. ఇక ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్‌, సుదీప్‌, జగపతిబాబు, విజయ్‌ సేతుపతి లాంటి భారీ తారాగణ నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుంది. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్‌ త్రివేదీ ఈ చిత్రానికి మ్యూజిక్ ను అందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో హీరో రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :