‘సైరా’.. అందుకే ఆ డేట్ ఫైనల్ చేసింది !

Published on May 17, 2019 4:00 am IST

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో రుపొందుతున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రాన్ని అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా విడుదల చెయ్యాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం ఆ డేటే ఫైనల్ అయిందట. ఈ డేట్ నే ఫిక్స్ చెయ్యడానికి అక్టోబర్ 8న విజయ దశమి అవ్వడమే కారణమని తెలుస్తోంది. అక్టోబర్ 2న రిలీజ్ చేస్తే.. రెండో వారం నుండి దసరా సెలవులు కూడా తమ సినిమాకు కలిసొస్తాయని చిత్రబృందం ఆలోచిస్తోంది. అందుకే అక్టోబర్ 2ను ఫైనల్ చేసింది.

సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాలో సుదీప్, అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, జగపతిబాబు వంటి స్టార్ లు నటిస్తున్నారు. అందుకే సైరా కోసం తెలుగు ప్రేక్షకులే కాకుండా.. హిందీ, కన్నడ మరియు తమిళ ప్రేక్షకులు కూడా సినిమా పై ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఇక ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుంది. భారీ బడ్జెట్ తో హీరో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు.

సంబంధిత సమాచారం :

More