ఇంటర్వ్యూ : ఉత్తరా మేనన్ – ఎప్పటికప్పుడు నన్ను నేను అప్‌ డేట్‌ చేసుకుంటాను !

Published on Sep 26, 2019 4:32 pm IST

మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే సినిమాలో మెగాస్టార్ గెటప్ అండ్ లుక్స్ తో పాటు, నయనతార, తమన్నాల లుక్స్ అండ్ గెటప్స్ కూడా చాలా హుందాగా కనిపించాయి. అలాగే నటీనటులందరూ చాల స్టైలిష్ గా కనిపించారు. అందుకు కారణం ఈ సినిమాకి స్టైలిస్ట్ గా పని చేసిన ఉత్తరా మేననే. ఆమె పడిన కష్టానికి ప్రతిఫలమే అది. కాగా తాజాగా ‘ఉత్తరా మేనన్’ మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు ఇప్పుడు మీ కోసం..

 

ముందుగా, మీ గురించి చెప్పండి ?

మా నాన్నగారిది కేరళ, కానీ మా అమ్మగారిది చెన్నై. అయితే నేను పుట్టిపెరిగినదంతా చెన్నైలోనే. నాకు 11 ఏళ్ల వయసులో ఫ్యాషన్‌ రంగంలోకి అడుగుపెట్టాను. ర్యాంప్‌ పై కూడా నడిచాను. అయితే మా వారికి ప్రొడక్షన్‌ సంస్థ ఉంది. ఆయన తీసే ప్రకటనలకు నేను స్టైలింగ్‌, డిజైనింగ్‌ చేసేదాన్ని. అలా మిరిండా, 7 అప్‌ వంటి యాడ్స్ కూడా పని చేశాను.

 

మీకు మొదట సినిమా అవకాశం ఎలా వచ్చింది ?

మా అన్నయ్య ప్రముఖ దర్శకుడు గౌతమ్‌ మేనన్‌. ఓ యాడ్‌ ఫిల్మ్‌ కోసం నేను చేసిన స్టైలింగ్‌ చూసి.. నాకు సినిమా అవకాశం ఇచ్చారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన తమిళ్ సినిమా ‘ఎన్నై ఆరిందాల్‌’ నా మొదటి సినిమా. మొదటి సినిమాకే నాకు అవార్డు కూడా వచ్చింది. నన్ను నేను ఎప్పటికప్పుడు అప్‌ డేట్‌ చేసుకుంటూ ఉంటాను. అందుకే నాకు అవకాశాలు వస్తున్నాయి.

 

కానీ, ‘సైరా’ లాంటి భారీ సినిమాకి పని చేసే అవకాశం రావడం మాములు విషయం కాదు కదా ?

విక్రమ్‌ కె కుమార్‌ గారి దర్శకత్వంలో వచ్చిన ‘మనం’ సినిమాకి నేను పని చేశాను. ఆ తరువాత ‘సాహసం శ్వాసగా సాగిపో’, ‘శైలజారెడ్డి అల్లుడు’, నానీస్ గ్యాంగ్‌ లీడర్‌’ లాంటి సినిమాలకు కాస్ట్యూమ్‌ డిజైనర్‌ గా చేశాను. ఆ సినిమాల్లో నా వర్క్ చూసే సురేందర్‌ రెడ్డిగారు నాకు ‘సైరా’కి స్టైలిస్ట్‌ గా చేయమని అవకాశం ఇచ్చారు.

 

మరి ‘సైరా’కి పని చేసే క్రమంలో ఎలాంటి కసరత్తులు చేశారు ?

కథ గురించి పూర్తిగా తెలుకుని.. కథలోని పాత్రలను అర్ధం చేసుకున్నాక.. కథలోని ప్రతి పాత్ర ఆహార్యాన్ని స్కెచ్ స్ రూపంలో వేసుకున్నాం. అలా ప్రతి పాత్ర గెటప్ దగ్గర నుంచి లుక్ వరకూ ఎంతో రీసెర్చ్ చేసి పని చేసాము. అయితే అంజూమోదీ, సుస్మితా కొణిదెల కాస్ట్యూమ్‌ డిజైనర్లుగా పనిచేస్తే, నేను సినిమా మొత్తానికి స్టైలిస్ట్‌గా పని చేశాను.

 

సినిమాకి స్టైలింగ్‌ అంటే.. ఎన్నో విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి కదా ?

అవును. సినిమా కథ గురించి పూర్తిగా తెలియాలి. అలాగే కథలోని పాత్రల వ్యక్తిత్వంతో పాటు నేపథ్యాన్ని అలాగే ఆ పాత్రల పరిస్థితులను, స్థితి గతులను ప్రతిబింబించేలా స్టైలింగ్‌ చేయాల్సి ఉంటుంది. దాని కోసం ఎంతో రీసెర్చ్ చెయ్యాలి. అప్పుడే నేపథ్యం పై, పాత్రల పై ఒక అవగాహన వస్తోంది.

 

‘సైరా’ కోసం మీరు చాల రీసెర్చ్ చేశాం అన్నారు. ఎలాంటి రీసెర్చ్ చేశారు ?

చరిత్రలోని అంశాలు గురించి చెప్పేటప్పుడు.. ఆ చరిత్ర గురించే పూర్తిగా అర్ధం చేసుకోవాలి. సైరా కోసం నేను ప్రధానంగా అప్పటి చరిత్ర పుస్తకాలు చాల చదివాను. అలాగే మ్యూజియంలకూ వెళ్లాను. కథా నేపథ్యంకి సంబంధించి అక్కడి లోకల్ ప్రాంతాలు తిరిగాను. అన్ని విషయాల పై స్పష్టత వచ్చాకే ఈ సినిమాకి పని చేయడం జరిగింది.

 

మీ తదుపరి సినిమాలు గురించి ?

ప్రస్తుతం రెండు సినిమాలు జరుగుతున్నాయి. అలాగే ఓ తమిళ్ సినిమాకి కూడా పని చేస్తున్నాను.

సంబంధిత సమాచారం :

X
More