‘సైరా’ సెట్ లో భారీ అగ్ని ప్రమాదం !

Published on May 3, 2019 8:12 am IST

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో రుపొందుతున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం షూటింగ్ ప్రస్తుతం తుదిదశలో ఉంది. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో శరవేగంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం సెట్ భారీ అగ్ని ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డిలోని
నార్సింగ్ పీఎస్ పరిధి కోకాపేట లోని హిరంజీవి ఫామ్ హౌస్ లో సైరా నరసింహారెడ్డి చిత్రం షూటింగ్ కోసం వేసిన సెట్టింగ్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.

ఇక ఈ చిత్రంలో సుదీప్, అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, జగపతిబాబు వంటి స్టార్ లు నటిస్తున్నారు. ఒక పక్క సైరా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుంది. భారీ బడ్జెట్ తో హీరో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు.

సంబంధిత సమాచారం :

More