‘సైరా’లో న్యూ లుక్ తో ఆకట్టుకున్న తమన్నా !

‘సైరా’లో న్యూ లుక్ తో ఆకట్టుకున్న తమన్నా !

Published on Dec 21, 2018 3:11 PM IST


మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం శరవేగంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రంలో మిల్క్ బ్యూటీ తమన్నా కూడా ఓ కీలక పాత్రలో నటిస్తోన్న విషయం తెలిసిందే.

కాగా ఈ రోజూ తమన్నా పుట్టినరోజు. ఈ సందర్భంగా, సైరా చిత్రబృందం సైరా చిత్రంలోని ఆమె లుక్ ని రివీల్ చేస్తూ… తమన్నా పోస్టర్ ను విడుదల చేసింది. పోస్టర్ లో సాంప్రదాయ వస్త్రధారణలో మరియు అలంకరణలతో ఉన్న తమన్నా లుక్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది

బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో నయన తార, తమన్నా, విజయ్ సేతుపతి, సుధీప్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకం ఫై భారీ బడ్జెట్ తో హీరో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు