‘సైరా’ టెస్ట్ షూట్లో పాల్గొన్న చిరంజీవి !
Published on Nov 16, 2017 3:08 pm IST

మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా ‘సైరా నరసింహారెడ్డి’ రెగ్యులర్ షూట్ కు వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తిచేసిన టీమ్ షూట్ కు వెళ్లబోయే ముందు ఒక ట్రయల్ వేసి చూశారు. ఆ ముందస్తు ప్రయత్నంలో మెగాస్టార్ చిరంజీవి పై టెస్ట్ షూట్ నిర్వహించారు. ఆ టెస్ట్ షూట్ ఔట్ ఫుట్ చాలా బాగా వచ్చిందట.

చిరు లుక్స్ దగ్గర్నుంచి కాస్ట్యూమ్స్ వరకు అన్నీ పర్ఫెక్ట్ గా కుదిరాయని టాక్. దీంతో టీమ్ రెట్టించిన ఉత్సాహంతో షూటింగుకు రెడీ అవుతున్నారు. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి ఏ.ఆర్ రెహమున సంగీతాన్ని అందించనుండగా రత్నవేలు డివోపి చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం సుమారు రూ. 150 కోట్ల భారీ బడ్జెట్ ను కేటాయించారు రామ్ చరణ్.

 
Like us on Facebook