సైరా కోసం రాయలసీమ విలేజ్ సెట్ !

Published on Jan 3, 2019 5:04 pm IST

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151వచిత్రం ‘సైరా’ ఇటీవల జార్జియా షెడ్యూల్ తో పాటు హైదరాబాద్ లో జరిగిన షెడ్యూల్ ను ముగించుకుంది. ఇక ఈ చిత్రం తదుపరి షెడ్యూల్ రామోజీ ఫిలిం సిటీ లో జరుగనుంది. ఈషెడ్యూల్ కోసం ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ రాయలసీమ విలేజ్ సెట్ ను నిర్మిస్తున్నారు. ఈషెడ్యూల్ లో చిరు తోపాటు నయన తార ,అమితాబ్ బచ్చన్ లు కూడా పాల్గొననున్నారు.

సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది స్వరాలు సమకూరుస్తున్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ పతాకం ఫై రామ్ చరణ్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈచిత్రాన్ని ఈ ఏడాది సమ్మర్ కు విడుదలచేసేలా ప్లాన్ చేస్తున్నారు చిత్ర యూనిట్.

సంబంధిత సమాచారం :