“సైరా” ట్రైలర్ కు అంచనాలను మించిన స్పందన.!

Published on Sep 20, 2019 1:25 pm IST

టాలీవుడ్ లెజెండరీ నటుడు మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన భారీ బడ్జెట్ పీరియాడికల్ చిత్రం “సైరా నరసింహా రెడ్డి”. ఈ సినిమాపై అంచనాలు మాత్రం ఇప్పుడు వేరే లెవెల్లో ఉన్నాయని చెప్పాలి.అసలు ఈ భారీ ప్రాజెక్ట్ ను మొదలు పెట్టినప్పుడే ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి.అలా ఇటీవలే విడుదల చేసిన టీజర్ చూసేసరికి మెగాభిమానులకు ఇక మళ్ళీ పాత రోజులు గుర్తుకు వచ్చేసాయి.మరోసారి బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయం అని సినిమా కోసం ఎదురు చూస్తున్నామని సోషల్ మీడియాలో చెప్పుకొచ్చారు.

అలా చెప్పిన వారిలో టాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా చాలా మంది ఉన్నారు.అయితే సినిమా విడుదల అయ్యే లోపు మరో కీలక ఘట్టం అయినటువంటి ట్రైలర్ విడుదల కూడా భారీ ఎత్తున నిర్వహించడంతో కేవలం ఈ ప్రదర్శనకే రిలీజ్ రోజు వేడుకలా థియేటర్లు నిండిపోయాయి.అలా ఎన్నో అంచనాలను పెట్టుకున్న ఈ ట్రైలర్ కూడా ఎక్కడా తగ్గకుండా ఉండేసరికి ఈ చిత్రంపై ఆ అంచనాలు మరింత పెరిగిపోయాయి.అయితే మూడు నిముషాలు ఉన్న ట్రైలర్ కు మాత్రం యూట్యూబ్ లో ఒక్కరోజులోనే ఊహించని రెస్పాన్స్ వస్తుంది.

యూట్యూబ్ లోని అనేక వీడియోలకు రియాక్షన్స్ ఇచ్చే చానెళ్లు చాలానే ఉన్నాయి.అలాంటి కొన్ని ఛానెల్స్ లో “సైరా” ట్రైలర్ కు కేవలం ఒక్క రోజు వ్యవధిలోనే లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి.కేవలం వేలలో సబ్ స్క్రైబర్స్ ఉన్న చానెల్స్ లో కూడా సైరా ట్రైలర్ పై చేసిన వీడియోలకు ఒక్క రోజులోనే లక్షల వ్యూస్ వస్తున్నాయి.దీనిని బట్టే “సైరా”పై ఎలాంటి క్రేజ్ ఉందో అర్ధం చేసుకోవచ్చు.అనేక మంది అగ్ర తారలు ఉన్న ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించగా రామ్ చరణ్ నిర్మించారు.ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా వచ్చే అక్టోబర్ 2న బాక్సాఫీస్ పై దాడి చేసేందుకు సిద్ధంగా ఉంది.

సంబంధిత సమాచారం :

X