సౌత్ లో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తాప్సి !

Published on May 9, 2019 9:05 pm IST

‘ఝుమ్మంది నాదం’ తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన పంజాబీ బ్యూటీ తాప్సి పన్ను ఆతరువాత జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసింది. అయితే ప్రస్తుతం సౌత్ లో ఫోకస్ తగ్గించి బాలీవుడ్ లో సినిమాలు చేయడానికి ఇంట్రస్ట్ చూపిస్తుంది ఈబ్యూటీ. అందుకు తగ్గట్లు గానే అక్కడ ఆమె నటించిన చిత్రాలు విజయాలు సాధిస్తున్నాయి.

ఇక ఇప్పుడు తాజాగా తాప్సి తమిళంలో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. తమిళ స్టార్ హీరో జయం రవి ప్రస్తుతం తన 25వ చిత్రం కోమలి లో నటిస్తున్నాడు. ఈసినిమా తరువాత అహ్మద్ డైరెక్షన్ లో మరో సినిమా చేయడానికి ఓకే చెప్పాడట. ఈచిత్రంలో జయం రవి కి జోడీగా తాప్సి నటించనుందట త్వరలోనే ఈ చిత్రం గురించి మరిన్ని వివారాలు వెలుబడనున్నాయి.

సంబంధిత సమాచారం :

More