చష్మే బద్దూర్ తో డ్రీం డ్రీమ్ స్టార్ట్ అందుకున్న తాప్సీ
Published on Apr 7, 2013 2:30 pm IST

Taapsee-latest
ఢిల్లీ బ్యూటీ తాప్సీ బాలీవుడ్లో అడుగుపెట్టిన ‘చష్మే బద్దూర్’ సినిమాకి మంచి టాక్, మిక్స్డ్ రివ్యూలు రావడంతో థ్రిల్ కి గురయ్యారు. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ రావడం అలాగే బాక్స్ ఆఫీసు వద్ద మంచి స్టార్ట్ లభించింది. బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరన్ ఆదర్శ్ ‘ చష్మే బద్దూర్ కి మార్నింగ్ షో కి వచ్చిన ఓపెనింగ్స్ చూసి ఇండస్ట్రీలో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ వారం ఎలాంటి పోటీ లేకుండా విడుదలైన ఈ సినిమాకి మంచి మౌత్ టాక్, మూవీ క్రిటిక్స్ అందరూ మంచి రేటింగ్స్ ఇవ్వడంతో శుక్రవారం సాయంత్రం నుంచి ఇంకా ఊపందుకుంది. వీకెండ్ కల్లా మంచి కలెక్షన్స్ వస్తాయని’ ట్వీట్ చేసాడు.

మరో వైపు తాప్సీ కూడా తన నటనకి గాను మిక్స్డ్ ఫలితాన్ని అందుకుంది. టాప్ మూవీ క్రిటిక్ రాజీవ్ మసంద్ ‘ తాప్సీ లో ఒక ఐస్ క్యూబ్ కి ఉన్నంత చార్మ్ ఉందని నేను ఊహించలేదు’ అన్నాడు, అలాగే అనుపమ చోప్రా ‘ తాప్సీ లో దమ్ హై బాస్ అంతకన్నా బెటర్ లేదని’ అన్నాడు. వారి బాటలోనే తరన్ ఆదర్శ్, భరద్వాజ్ రంగన్ లు కూడా ‘ తెలుగు తమిళ భాషలతో పోల్చుకుంటే బాలీవుడ్లో ఎంతో డిఫరెన్స్ కనపడిందని’ అన్నారు.

ఇవన్నీ పక్కన పెడితే తాప్సీ తన డ్రీమ్ స్టార్ట్ ప్రాజెక్ట్ కి వస్తున్న రెస్పాన్స్ చూసి ఫుల్ ఖుషీ ఖుషీగా ఉంది. ‘ చష్మే బద్దూర్ తో నాకు డ్రీమ్ స్టార్ట్ అందించిన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు. బాలీవుడ్లో తొలి సినిమాకి పర్ఫెక్ట్ గా సరిపోయే సినిమా, ఆలాగే సూపర్బ్ కో స్టార్స్, వయోకాం18 వారికి, కెప్టెన్ డేవిడ్ సార మీరు నెంబర్ వన్ డైరెక్టర్అని’ ట్వీట్ చేసింది. ప్రస్తుతం తాప్సీ మాల్దీవ్స్ లో హాలిడేస్ ఎంజాయ్ చేస్తోంది.

 
Like us on Facebook