
సొట్ట బుగ్గల సుందరి తాప్సీ ముంబాయికి షిఫ్ట్ అయినప్పటి నుంచి తాప్సీ బాలీవుడ్ సినిమాల పైన దృష్టి పెట్టడానికే అక్కడికి మకాం మార్చిందని అన్నారు. కానీ ఆ వార్తలని తాప్సీ కొట్టిపారేసింది. కానీ తాజా సమాచారం ప్రకారం తాప్సీ బాలీవుడ్ లో ఒక భారీ ఆఫర్ దక్కించుకుంది.
త్వరలోనే నీరజ్ పాండే దర్శకత్వంలో అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కనున్న సినిమాలో తాప్సీ హీరోయిన్ గా ఎంపికైంది. గతంలో నీరజ్ పాండే – అక్షయ్ కుమార్ కాంబినేషన్లో ‘స్పెషల్ 26’ వచ్చింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా విశ్లేషకుల ప్రశంశలు కూడా అందుకుంది. వీరిద్దరి కాంబినేషన్లో రానున్న కొత్త యాక్షన్ సినిమాలో తాప్సీ అండర్ కవర్ ఏజెంట్ గా కనిపించనుంది. ఇటీవలే ఈ భామ డిఫరెంట్ రోల్స్ చేయాలని ఉందని చెప్పింది, అంతలోనే నీరజ్ పాండే నుండి ఇలాంటి ఆఫర్ రావడంతో తను చాలా హ్యాపీగా ఉంది.
ప్రస్తుతం హిందీ మూవీ రన్నింగ్ షాది డాట్ కామ్ సినిమాలో నటిస్తోంది. అలాగే ఐశ్వర్య ధనుష్ దర్శకత్వం వహిస్తున్న తమిళ సినిమా వెయ్ రాజా వెయ్ సినిమాలో అతిధి పాత్రలో కనిపించనుంది.

