‘గేమ్ ఓవర్’ తర్వాత ఆపాత్రలకు తాప్సి బెస్ట్ ఛాయస్ కానుందా..!

Published on Jun 15, 2019 10:45 am IST

తాప్సి ప్రధాన పాత్రలో కంప్లీట్ హారర్ జోనర్ లో నిన్న విడుదలైన “గేమ్ ఓవర్” మూవీకి క్రిటిక్స్ తోపాటు, ప్రేక్షకులకుల నుండి మంచి స్పందన వస్తుంది.ఈ హారర్ మూవీలో మానసికమైన లోపంతో ఇబ్బంది పడే అమ్మాయిగా తాప్సి నటనకు మంచి మార్కులే పడ్డాయి. దీనితో హారర్ జోనర్ లో వచ్చే చిత్రాలకు తాప్సిను మంచి ఆప్షన్ గా దర్శకులు నిర్మాతలు భావిస్తారని ఇండస్ట్రీ టాక్. ఇప్పటివరకు సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో కథానాయిక ప్రధానమైన హారర్ సినిమాలకు మంచి ఆప్షన్ గా నయనతార,అంజలి,త్రిషా వంటి తారలు ఉన్నారు. ఇప్పుడు ఈ లిస్ట్ లో తాప్సి చేరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

తాప్సి ఇంతకు ముందు తెలుగులో ‘యాత్ర’ డైరెక్టర్ మహి రాఘవ తన మొదటి చిత్రంగా తెరకెక్కించిన “ఆనందో బ్రహ్మ” హారర్ కామెడీ మూవీలో నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తాప్సి నటించిన “గేమ్ ఓవర్” మూవీకి అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహించగా, వై నాట్ స్టూడియోస్,రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించారు.

సంబంధిత సమాచారం :

More