ఈ సీనియర్ హీరోయిన్ కి అంత డిమాండ్ ఉందా ?

Published on Jul 16, 2019 4:58 pm IST

ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది హాట్ హీరోయిన్ టబు. అయితే ఇలాంటి ఒకప్పటి టాప్ హీరోయిన్స్ ను తన సినిమాల్లో తల్లి లేదా అత్త క్యారెక్టర్స్ లో చూపిస్తుంటారు త్రివిక్రమ్. అలాగే ఇప్పుడు అల్లు అర్జున్ సినిమాలో కీలక పాత్రలో టబు నటిస్తోన్న సంగతి తెలిసిందే. కాగా ఇటీవలే టబు నటించిన హిందీ చిత్రాలు ‘అందాదున్, దే దే ప్యార్ దే’ సూపర్ హిట్ కావడంతో.. టబు రెమ్యునరేషన్ విషయంలో బాగా డిమాండ్ చేస్తోందట.

హిందీ సినిమాల్లో ఆమె అడిగినంత ఇస్తున్నారని… అలాగే తెలుగు సినిమాల్లో కూడా అంతే ఇవ్వాలని టబు కాస్త గట్టిగానే డిమాండ్ చేస్తోందని తెలుస్తోంది. టబు డిమాండ్ చేసే రెమ్యునరేషన్.. ఏకంగా హీరోయిన్ రెమ్యునరేషన్ కంటే.. ఎక్కువుగా ఉందట. మొత్తానికి ప్రస్తుతం టాలీవుడ్ లో డిమాండ్ లేనప్పుడే ఇంతగా డిమాండ్ చేస్తుంటే.. ఒకవేళ బన్నీ సినిమా వల్ల టబుకు డిమాండ్ పెరిగితే.. ఇంకెంత డిమాండ్ చేస్తోందో చూడాలి.

కాగా తమన్ సంగీతం అందించనున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ మరియు హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తండ్రి కొడుకుల మధ్య సాగే హై ఎమోషనల్ డ్రామా ఈ సినిమా అని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో సుశాంత్ కూడా కీలక నటిస్తున్నారు. అలాగే మరో కీలక పాత్రలో ప్రముఖ మలయాళ నటుడు జయరామ్ నటిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :

X
More