‘విరాటపర్వం’లో టబు సరికొత్తగా .. ?

Published on May 3, 2019 1:00 am IST

రానా సాయిప‌ల్ల‌వి హీరోహీరోయిన్ లుగా దర్శకుడు ‘వేణు ఉడుగుల’ దర్శకత్వంలో ‘విరాటపర్వం’ అనే రాజ‌కీయ నేప‌థ్యంలో సాగే ల‌వ్ స్టోరీని తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం స్క్రిప్ట్ కు మెరుగులు దిద్దే పనిలో ఉన్నాడు వేణు. ఇక జులై నుంచి ఈ చిత్రం సెట్స్‌ పైకి వెళ్ళనుంది. కాగా ఈ చిత్రంలో ఓ కీల‌క‌మైన పాత్ర‌లో ట‌బు నటిస్తోన్న సంగతి తెలిసిందే.

రాజ‌కీయ నేప‌థ్యంలో సాగే ఈ సినిమాలో ట‌బు మాన‌వ హ‌క్కుల నేత‌గా నటిస్తోంది. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం టబు పాత్రలో నెగిటివ్ షేడ్స్ ఎక్కువ ఉంటాయట. ఒక రకంగా లేడీ విలన్ గా ఈ సినిమాలో టబు నటిస్తోన్నట్లు తెలుస్తోంది. తన పాత్ర సరికొత్తగా ఉండటం కారణంగానే ఈ సినిమా చెయ్యడానికి టబు ఏం ఆలోచించకుండా వెంటనే అంగీకరించిందని సమాచారం.

సంబంధిత సమాచారం :

More