‘ముకుంద’ సినిమాపై ధీమా వ్యక్తం చేసిన ఠాగూర్ మధు.

‘ముకుంద’ సినిమాపై ధీమా వ్యక్తం చేసిన ఠాగూర్ మధు.

Published on Dec 17, 2014 12:36 PM IST

Mukunda
మెగా వారసుడు వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న ‘ముకుంద’ సినిమా షూటింగ్ పూర్తవడంతో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ మీద దృష్టి సారించారు దర్శకనిర్మాతలు. సినిమా అవుట్ పుట్ పట్ల సమర్పకులు ఠాగూర్ మధు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. వరుణ్ తేజ్ ను హీరోగా పరిచయం చేయడం ఆహ్లాదకరమైన అనుభవమని చెప్పారు. ట్రెడిషనల్ వాల్యూస్, ఎంటర్టైన్మెంట్, రొమాన్స్ & డ్రామా ఇలా ప్రేక్షకులు కోరుకునే అంశాలతో సినిమాను తెరకెక్కించామని చెప్పారు.

మిక్కీ జె మేయర్ స్వరపరిచిన మెలోడియస్ సాంగ్స్ మ్యూజిక్ ప్రేమికులను ఆకట్టుకున్నాయి. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో వరుణ్ తేజ్ సరసన బ్యూటీ క్వీన్ పూజా హెగ్డే నటిస్తుంది.

ఈ సినిమాకు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. ఠాగూర్ మధు సమర్పణలో నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి) ‘ముకుంద’ను నిర్మిస్తున్నారు. ఈ నెల 24 న ఒక గ్రాండ్ రిలీజ్ కి సినిమా సిద్దమయ్యింది.

తాజా వార్తలు