అజిత్ ‘విశ్వాసం’ నుండి అప్డేట్ రానుంది !

Published on Oct 5, 2018 3:58 am IST


తమిళ స్టార్ హీరో తల అజిత్ నటిస్తున్న ‘విశ్వాసం’చిత్రం యొక్క షూటింగ్ ప్రస్తుతం హైద్రాబాద్లోని రామోజీ ఫిలిం సిటీలో శర వేగంగా జరుగుతుంది. యాక్షన్ చిత్రాల దర్శకుడు శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అజిత్ డ్యూయెల్ రోల్లో నటిస్తున్నాడు. ఇక ఈచిత్రానికి సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్ అక్టోబర్ 5న వెలుబడనుంది. అజిత్ అభిమానులు ఈ అప్డేట్ ను రివీల్ చేయనున్నారు.

యాక్షన్ ఎంటెర్టైనెర్ గా తెరకెక్కుతున్న ఈచిత్రంలో నయనతార కథనాయికగా నటిస్తుంది. సత్యజ్యోతి ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈచిత్రానికి ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నారు. ఇక అజిత్ – శివ కలయికలో వస్తున్న ఈ నాల్గవ చిత్రం ఫై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈచిత్రం ప్రేక్షకులముందుకు రానుంది.

సంబంధిత సమాచారం :