సునీల్ సినిమాలో కీలక పాత్ర పోషించనున్న ప్రముఖ నటుడు

27th, October 2016 - 08:34:44 AM

Prakash-raj
ఈ మధ్య ‘ఈడు గోల్డ్ ఏహే’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన నటుడు సునీల్ ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ చిత్ర దర్శకుడు క్రాంతి మాధవ్ డైరెక్షన్లో ఓ సినిమా చేయనున్నాడు. ఈ చిత్రానికి ‘ఉంగరాల రాంబాబు’ అనే టైటిల్ ని కూడా పెట్టేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ చిత్రం నవంబర్ నుండి రెగ్యులర్ షూట్ కు వెళ్లే అవకాశముంది. ఇకపోతే ఎమోషన్ ఎంటర్టైనర్ గా ఉందనున్న ఈ చిత్రంలో ఓ ప్రముఖ నటుడు కీలక పాత్ర పోషించనున్నాడు. ఆయన మరెవరో కాదు జాతీయ స్థాయి నటుడు ‘ప్రకాష్ రాజ్’.

ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న మియా జార్జ్ కి తండ్రిగా ప్రకాష్ రాజ్ కనిపించనున్నాడు. ఆధ్యంతం ఎమోషనల్ గా సాగే ఈ పాత్ర కోసం మొదట చాలా మందినే అనుకున్నప్పటికీ ప్రకాష్ రాజ్ అయితే పాత్రకు న్యాయం చేయగలరని దర్శక నిర్మాతలు ఆయన్ను సంప్రదించగా ప్రకాష్ రాజ్ పాత్ర గురించి విని వెంటనే ఒప్పేసుకున్నారట. సినిమాలో ఈ పాత్రకు చాలా ప్రాముఖ్యం ఉంట్టుందని, హీరో సునీల్ తో పాటే చాలా కీలకమైన ఎమోషనల్ సన్నివేశాల్లో ప్రకాష్ రాజ్ కనిపిస్తారని తెలుస్తోంది. ఇకపోతే ఈ చిత్రానికి ఘిబ్రన్ సంగీతం అందించనున్నారు.