‘వెబ్ సిరీస్’ను డైరెక్ట్ చేయబోతున్న వైవిధ్యమైన దర్శకుడు !

Published on Sep 11, 2018 11:13 am IST

తెలుగు సినీపరిశ్రమలో ప్రస్తుతం యంగ్ టాలెంట్ హవానే నడుస్తోంది. ‘అర్జున్ రెడ్డి’ దగ్గర నుంచి మొన్న వచ్చిన ‘కేరాఫ్ కంచెరపాలెం’ వరకు యువ దర్శకులు వైవిధ్యమైన కథా కథనాలతో భారీ విజయాలను అందుకున్నారు. అయితే మరికొంతమంది ఫణీంద్ర, ప్రశాంత్‌ వర్మ లాంటి యువ దర్శకులు కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ సాధించలేకపోయిన తమ టాలెంట్ ను మాత్రం నిరూపించుకోగలిగారు.

కాగా, ప్రశాంత్‌ వర్మ తాజాగా హీరో రాజశేఖర్‌తో ఓ ఇన్‌వెస్టిగేటీవ్‌ థ్రిల్లర్ ‘కల్కి’ని రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం మొదలవ్వడానికి మరికొంత సమయం పట్టేలా ఉంది. దాంతో ఈ గ్యాప్‌లో ప్రశాంత్‌ వర్మ ఓ వెబ్‌ సిరీస్‌ ప్లాన్‌ చేసే పనిలో ఉన్నారట. సినీవర్గాల సమాచారం ప్రకారం ఆ వెబ్‌ సిరీస్‌ను ఘట్టమనేని మంజుల నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఇప్పటికే ఈ వెబ్‌ సిరీస్‌కి సంబంధించిన స్క్రిప్ట్ కూడా రెడీ అయిందని త్వరలోనే షూట్ మొదలవ్వబోతుంది. అయితే ఈ వెబ్ సిరీస్ లో నటించబోయే నటీనటులు వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :