గ్రే చిత్రంలో షణ్ముఖ ప్రియ పాడిన పాటను విడుద‌ల చేసిన త‌మ‌న్..!

గ్రే చిత్రంలో షణ్ముఖ ప్రియ పాడిన పాటను విడుద‌ల చేసిన త‌మ‌న్..!

Published on Feb 14, 2022 11:00 PM IST

అరవింద్‌ కృష్ణ, అలీ రెజా, ఊర్వశి రాయ్, ప్రతాప్ పోతన్ ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం “గ్రే(GREY)”. రాజ్ మదిరాజు దర్శకత్వంలో కిరణ్ కాళ్లకూరి, మాధురి కాళ్లకూరి నిర్మించారు. అయితే ఈ చిత్రంలో ఇండియన్ ఐడిల్ ఫేమ్ షణ్ముఖ ప్రియ పాడిన పాటను వాలెంటైన్స్ డే సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ విడుద‌ల చేశారు. ఈ సందర్భంగా చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పాటకు నాగరాజు తాళ్ళూరి స్వరరచన చేశారు.

బ్లాక్ అండ్ వైట్‌లో రూపొందిన సినిమా అనే వాస్తవాన్ని నిజం చేసేందుకు టీమ్ అన్ని ప్రమోషన్‌ల కోసం బ్లాక్ అండ్ వైట్ థీమ్‌ను ఎంచుకుంది. 4 దశాబ్దాల తర్వాత రూపొందుతున్న తొలి బ్లాక్ అండ్ వైట్ సినిమా గ్రే. ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులు ఒక ప్రత్యేక అనుభూతిని పొందేందుకు సిద్ధంగా ఉన్నారని మేము ఖచ్చితంగా అనుకుంటున్నామని దర్శక నిర్మాత‌లు తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు