నెగిటివ్ రోల్ లో తమన్నా !

Published on Mar 20, 2019 3:00 am IST

మిల్కీ బ్యూటీ తమన్నా,విశాల్ తో కలిసి మరో సారి నటించనుంది. సుందర్ సి ఈ కొత్త చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నాడు. ఇక ఈ చిత్రంలో తమన్నా నెగిటివ్ షేడ్స్ వున్న పాత్రలో నటించనుందని టాక్. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి ముఖ్య పాత్రలో నటించనుంది.

లైకా ప్రొడక్షన్స్ నిర్మించనున్న ఈ చిత్రం ఏప్రిల్ చివరి వారంలో మొదలుకానుంది. ఇక ఇంతకుముందు విశాల్ -తమన్నా కలిసి కత్తి సందై అనే చిత్రంలో నటించారు. అయితే ఈ చిత్రం డిజాస్టర్ ఫలితాన్ని చవిచూసింది. ఈసినిమా తెలుగులో ఒక్కడొచ్చాడు గా విడుదలైయింది.

సంబంధిత సమాచారం :

More