వరుణ్ తేజ్ తో తమన్నా స్పెషల్ సాంగ్ !

Published on Jul 26, 2021 12:19 pm IST

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ బాక్సింగ్ నేపథ్యంలో గని అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ తెలిసింది. ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా ఒక స్పెషల్‌ సాంగ్ చేయబోతుందట. ఇప్పటికే స్పెషల్‌ సాంగ్‌ లో నర్తించేందుకు తమన్నా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందని తెలుస్తోంది.

ఇక త్వరలోనే ఈ సాంగ్‌ ను షూట్ చేయనున్నారు. ఇప్పటికే తమన్నా పలు స్పెషల్‌ సాంగ్స్‌ చేసి మెప్పించిన సంగతి తెలిసిందే. ప్రముఖ బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్ కుమార్తె సాయి మంజ్రేకర్ ఈ సినిమాతో కథానాయికగా పరిచయం కానుంది. మొదటిసారి వరుణ్ తేజ్ చేస్తున్న స్పోర్ట్స్ డ్రామా కావడంతో ఈ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి.

సంబంధిత సమాచారం :