వరల్డ్’ స్ బిగ్గెస్ట్ కుకింగ్ రియాలిటీ షో కి హోస్ట్ గా తమన్నా భాటియా!

Published on Aug 6, 2021 8:58 pm IST


బుల్లితెర పై ప్రముఖులు, నటీనటులు తమ సత్తా చాటుతున్నారు. వెండి తెర పై మాత్రమే కాకుండా టెలివిజన్ లో కూడా తమదైన శైలిలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్దం అవుతున్నారు. అయితే బాహుబలి ఫేం తమన్నా భాటియా స్టార్ హీరోయిన్ గా ఎన్నో చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ మిల్కీ బ్యూటీ బుల్లి తెర పై ప్రేక్షకులను అలరించడానికి సిద్దం అయ్యారు.

వరల్డ్’ స్ బిగ్గెస్ట్ కుకింగ్ రియాలిటీ షో కి తమన్నా భాటియా హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. తెలుగు భాష ను, తెలుగు వంటలను ప్రపంచానికి తెలియ జేసెందుకు తమన్నా ఈ కార్యక్రమం ను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. మాస్టర్ చెఫ్ తెలుగు కార్యక్రమం ద్వారా తెలుగు వంటలను ప్రపంచానికి పరిచయం చేయనున్నారు. త్వరలో జెమిని టీవీ లో ఈ కార్యక్రమం ప్రసారం కానుంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన తాజాగా వెలువడింది.

సంబంధిత సమాచారం :