‘ఆగడు’ సెట్లో అడుగుపెట్టిన తమన్నా

Published on May 11, 2014 7:58 pm IST

Tamanna
తెలుగు సినిమా షూటింగ్ నుంచి చిన్న గ్యాప్ తీసుకున్న మిల్క్ బ్యూటీ తమన్నా ఈ రోజు నుంచి ‘ఆగడు’ సినిమా షూటింగ్ లో పాల్గొంటోంది. తమన్నా మొదటి సారి సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన జోడీ కడుతున్న ఈ మాస్ ఎంటర్టైనర్ కి శ్రీను వైట్ల డైరెక్టర్. తమన్నా మహేష్, శ్రీను వైట్లతో వర్కింగ్ ని బాగా ఎంజాయ్ చేస్తోంది.

ఈ సినిమాలో తమన్నా ఒక మిఠాయి కొట్టు ఓనర్ గా అలాగే సంఘ సేవ చేసే యువతిగా కనిపించనుందని ఇదివరకే తెలియజేశాం. ఈ రోజు ఈ భామ సినిమాలో తన లుక్ ఎలా ఉంటుంది అనేది ట్విట్టర్ లో రివీల్ చేసింది. ‘ఆగడు లొకేషన్ లో ఉన్నాను. సూపర్బ్ డైరెక్టర్ శ్రీను వైట్లతో పని చేస్తున్నానని’ త్వీత్ చెయ్యడమే కాకుండా ఒక వర్కింగ్ స్టిల్ ని కూడా ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.

ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే గుజరాత్ కి మారనుంది. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకి కెవి గుహన్ సినిమాటోగ్రాఫర్. ఈ భారీ బడ్జెట్ ఎంటర్టైనర్ ని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :