రీసెంట్ గా మన టాలీవుడ్ నుంచి రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో మిల్కీ బ్యూటీ తమన్నా మెయిన్ లీడ్ లో నటించిన చిత్రం “ఓదెల 2” కూడా ఒకటి. దర్శకుడు అశోక్ తేజ తెరకెక్కించిన ఈ సినిమాకి సంపత్ నంది నిర్మాణం సహా కథ అందించడం జరిగింది. అయితే థియేటర్స్ లో రిలీజ్ కి ముందే సాలిడ్ ఓటీటీ డీల్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ఫైనల్ గా ఓటీటీలో వచ్చేసింది.
ఈ సినిమా ఓటీటీ హక్కులు అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకోగా అందులో నేటి నుంచి పాన్ ఇండియా భాషల్లో అందుబాటులోకి వచ్చేసింది. మరి అప్పుడు మిస్ అయ్యిన ఈ చిత్రం చూడాలి అనుకుంటే ప్రైమ్ వీడియోలో చూడవచ్చు. ఈ చిత్రం కేవలం 3 వారాల్లోనే ఓటీటీ లోకి వచ్చేయడం గమనార్హం.
సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి