యాక్షన్ హీరో సరసన మిల్కీ బ్యూటీ

Published on Sep 22, 2019 10:00 pm IST

క్రేజీ ఆఫర్లతో దూసుకుపోతున్న మిల్కీ బ్యూటీ తమన్నాకు మరో ఆఫర్ దక్కినట్టుంది. ఇప్పటికే చిరంజీవి ‘సైరా’ చిత్రంలో ఒక కీ రోల్ చేసిన ఆమెకు యాక్షన్ హీరో గోపిచంద్ కొత్తగా సైన్ చేసిన చిత్రంలో కూడా ఛాన్స్ దొరికేట్లుంది. కథానాయకిగా ఈమెనే తీసుకోవాలనే చర్చలు జరుగుతున్నాయట. అయితే ఈ విషయం ఇంకా ఫైనల్ కాలేదు.

సంపత్ నంది దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను ‘యు టర్న్’ నిర్మాత శ్రీనివాస చిత్తూరి నిర్మించనున్నారు. అక్టోబర్ నెలలో ఈ సినిమా లాంచ్ కానుంది. గతంలో గోపిచంద్, సంపత్ నంది కలిసి ‘గౌతమ్ నంద’ అనే సినిమాను చేయగా తమన్నా కూడా సంపత్ చేసిన ‘బెంగాల్ టైగర్’ సినిమాలో నటించింది.

సంబంధిత సమాచారం :

X
More