వెంకీ సినిమాలో తమన్నా నటించాబోతోందా ?
Published on Mar 13, 2018 5:05 pm IST

దిల్ రాజు నిర్మాణంలో అనిల్ రావిపూడి సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ లో ఇద్దరు హీరోలు నటిస్తున్నారు. అందులో ఒక వెంకటేష్ అయితే మరొకరు వరుణ్ తేజ్. కాని అధికారికంగా ఎక్కడా ప్రకటన లేదు. తాజా సమాచారం మేరకు వెంకటేష్ సరసన తమన్నా నటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. చిత్ర యూనిట్ తమన్నా ఈ ప్రాజెక్ట్ కు సెట్ అవుతుందని భావిస్తున్నట్లు సమాచారం.

స్క్రిప్ట్ వర్క్ లో ఉన్న ఈ సినిమా త్వరలో ప్రారంభం కానుంది. ఎంటర్టైన్మెంట్ అందించడంలో మంచి పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి ఈ సినిమాలో కూడ బోలెడంత ఫన్ ఉండేలా చూస్తున్నారని సమాచారం. పోరాట సన్నివేశాలు ఈ సినిమాలో కనిపించబోవని డైరెక్టర్ ఈ మద్య ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఈ సినిమాకు ఎఫ్2 (ఫన్ అండ్ ఫ్రస్టేషన్) అనే టైటిల్ ఖరారు చెయ్యడం జరిగింది.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook