తమన్నా చేతుల మీదుగా షాప్ సీజే తెలుగు చానల్ లాంచ్!

tamanah
హిందీలో రెండు షాపింగ్ చానల్స్‌తో దూసుకుపోతోన్న షాప్ సీజే, తమ మార్కెట్ విస్తరణలో భాగంగా ప్రాంతీయ భాషల్లోనూ షాపింగ్ చానల్స్‌ను ప్రవేశపెట్టే ఆలోచన చేసింది. ఈ క్రమంలోనే మొదటగా షాప్ సీజే, తెలుగులో ఓ షాపింగ్ చానల్‌ను ప్రవేశపెట్టింది. 24 గంటల పాటు సాగే ఈ తెలుగు షాపింగ్ చానల్‌ను ఈ ఉదయం హైద్రాబాద్‌లో లాంచ్ చేశారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటి తమన్నా ముఖ్య అతిథిగా హాజరై షాపింగ్ చానల్‌ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆన్‌లైన్, హోమ్ షాపింగ్‌లకు ఆదరణ పెరిగిన కాలంలో తెలుగులో ఇలాంటి చానల్ రావడం సంతోషకరమని తెలిపారు. ఇక షాప్ సీజే సంస్థ నిర్వాహకులు మాట్లాడుతూ.. హోమ్ షాపింగ్‌కు మంచి ఆదరణ ఉన్న నేపథ్యంలోనే హిందీతో పాటు తమ సేవలను తెలుగు, కన్నడ, తమిళంలోకీ తీసుకొచ్చే ఆలోచన చేశామని తెలిపారు. త్వరలోనే తమిళ, కన్నడ చానల్స్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపారు.

Exit mobile version