రాజమౌళి సినిమా.. ఊహక్కూడా అందదు : తమన్నా

రాజమౌళి సినిమా.. ఊహక్కూడా అందదు : తమన్నా

Published on Mar 30, 2015 11:53 AM IST

Tamanna-1

దర్శకుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న చారిత్రక చిత్రం ‘బాహుబలి’ రెండు భాగాలుగా రానున్న విషయం తెలిసిందే. ఈ సినిమా మొదటి భాగం మే 15న విడుదలవుతుందన్న విషయాన్ని రాజమౌళి ఇంతకుముందే తెలియజేశారు. ఇక ఆడియో ఆవిష్కరణ వేడుకను ఏప్రిల్ రెండో వారంలో నిర్వహించే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ టీమ్ సెలవులు కూడా లేకుండా కష్టపడుతోంది. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

బాహుబలి సినిమా విశేషాలిలా ఉంటే.. ఇందులో ఓ కథానాయికగా నటించిన తమన్నా ఈ సినిమాకి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఓ ప్రముఖ తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ చానల్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎన్నికైన సందర్భంగా మాట్లాడుతూ, రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బాహుబలి’ లాంటి సినిమాలో నటించడం సంతోషంగా ఉందని తెలిపారు. మొదటి భాగంలోనే తన పాత్ర ఎక్కువగా ఉంటుందని, రెండో భాగంలో తక్కువ కనిపిస్తానని చెప్పారు. బాహుబలి సినిమా ఎలా ఉండబోతోందీ ? అన్న ప్రశ్నకు, రాజమౌళి సినిమాలో నటిస్తున్న నటులకే రాజమౌళి గారి ఊహలో ఏముందో తెలియదని, మన ఊహకు కూడా అందని విధంగా ఆయన సినిమాను తెరకెక్కిస్తారని తెలిపారు. మన ఊహకు కూడా అందని రీతిలో బాహుబలి ఉండనుందని తమన్నా స్పష్టం చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు