రీబక్ యాడ్ లో హీటేక్కిస్తున్న తమన్నా…!

Published on Aug 5, 2019 10:06 pm IST

తమన్నా తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో ఓ వీడియో పోస్ట్ చేశారు. అంతర్జాతీయ క్రీడా ఉత్పత్తుల సంస్థ రీబక్ ప్రొడక్ట్స్ సంబంధిన ఆ ప్రచార చిత్రంలో తమన్నా సెక్సీ లుక్స్, హాట్ పోజెస్ తో హీటెక్కించింది. రీబక్ స్పోర్ట్స్ ఇన్నర్ వేర్స్ అలాగే షూస్ ప్రదర్శిస్తూ తనదైన శైలిలో ఆ బ్రాండ్ ఉత్పత్తులకు ప్రచారం కల్పిస్తున్నారు. ముప్ఫై ఆరు సెకన్ల నిడివి కలిగిన ఆ వీడియోలో తమన్నా చాలా హాట్ గా కనిపించింది. ఎక్స్ సోలె ఫ్యూరీ అనే ఎడిషన్ తో విడుదల కానున్న రీబక్ ఉత్పత్తులకు తమన్నా ప్రచార కర్తగా చేస్తున్నారనిపిస్తుంది.

ఈ ఏడాది “ఎఫ్2” చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తమన్నా ప్రతిష్టాత్మక సైరా చిత్రంలో ఓ కీలకపాత్ర పోషిస్తున్నారు. అలాగే హిందీ లో ఘనవిజయం సాధించిన “క్వీన్” మూవీ తెలుగు రీమేక్ “దట్ ఈజ్ మహాలక్ష్మి” చిత్రంతో పాటు,ఓ హిందీ,రెండు తమిళ చిత్రాలలో నటించనున్నారని సమాచారం.

సంబంధిత సమాచారం :