శ్రీదేవి బయోపిక్ చేయాలనుందంటున్న స్టార్ హీరోయిన్

Published on Jun 12, 2019 9:44 pm IST

టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్.. పరిశ్రమ ఏదైనా ఇప్పుడు బయోపిక్స్ ట్రెండ్ బాగా నడుస్తోంది. ప్రముఖ క్రీడాకారులు, నటీ నటులు, రాజకీయ, ఇతర రంగాల ప్రముఖుల జీవితాల ఆధారంగా రూపొందే సినిమాల్లో నటించేందుకు స్టార్లు రెడీగా ఉన్నారు. అలాంటి వారిలో స్టార్ హీరోయిన్ తమన్నా కూడా ఉంది.

తనకు శ్రీదేవి అంటే చాలా ఇష్టమని, ఆమెను చూసే సినిమాలపై ఆసక్తి పెంచుకున్నానంటున్న తమన్నా శ్రీదేవి బయోపిక్‌లో నటించాలని ఉందని మనసులోకి కోరికను బయటపెట్టింది. మరి మిల్కీ బ్యూటీ కోరికను విని శ్రీదేవి బయోపిక్ చేయాలనే ఆలోచన ఉన్న దర్శక నిర్మాతలు సంప్రదిస్తే ఆమె కోరిక తీరినట్టే. ప్రస్తుతం ‘సైరా’లో ఒక కీలక పాత్ర చేస్తున్న ఆమె తమిళంలో విశాల్ సరసన ఒక సినిమా చేస్తున్నారు. హిందీలో ఆమె చేసిన ‘ఖామోషి’ చిత్రం విడుదలకు రెడీగా ఉంది.

సంబంధిత సమాచారం :

More