కొత్త నటులతో టాంగా ప్రొడక్షన్స్ వారి ప్రొడక్షన్ నెం.2 లాంచ్..!

Published on Sep 29, 2020 2:31 pm IST

నూతన నటీనటులతో విజయ్ దశి, ప్రదీప్ ఎర్రబెల్లి సంయుక్తంగా టాంగా ప్రొడక్షన్స్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెం.2 చిత్రం పూజా కార్యక్రమాలు జరిగాయి. దీనికి ముఖ్య అతిథులు గా నిర్మాత మధుర శ్రీధర్,డైరెక్టర్ కృష్ణ చైతన్య హాజరయ్యారు.ఈ సందర్భం గా ప్రొడ్యూసర్ విజయ్ దశి మాట్లాడుతూ.. “మా మొదటి చిత్రం ఆనంద్ దేవరకొండ హీరోగా షూటింగ్ దశలో ఉంది.ఇప్పుడు రెండో చిత్రంగా కొత్తవాళ్లతో మంచి లవ్ స్టోరీ తీయబోతున్నాం అని తెలిపారు.

‘‘విజిలింగ్ వుడ్స్ ఎంటర్టైన్మెంట్స్” లో ఫిలిం కోర్స్ చేసిన ఓ యువకుడు పృథ్వీసేన రెడ్డి చెప్పిన ఒక ఇంటెన్స్ లవ్ స్టోరి నచ్చడం తో వెంటనే ఓకే చేశాం. తెలుగు,తమిళ భాషలలో రూపొందనున్న ఈ మూవీ కోసం కొత్త నటీనటులను తీసుకోవాలనుకున్నాం. అందుకే సుమారుగా 500 మందిని ఆడిషన్స్ చేసి నటీనటుల్ని ఎంపిక చేసాం..వాళ్ల వివరాలు త్వరలో తెలియజేస్తాం.అక్టోబర్ మొదటి వారం నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టి , ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం” అని తెలిపారు.

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ వాసు పెండెం అందిస్తుండగా, సంగీతం సన్నీ ఎం ఆర్, పాటలు చంద్రబోస్,కృష్ణచైతన్య ,రాంబాబు గోసాలలు అందిస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి నిర్మాతలుగా విజయ్ దశి ,ప్రదీప్ ఎర్రబెల్లిలు వహిస్తుండగా రచన,దర్శకత్వం పృథ్వీసేన రెడ్డి అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More