‘అయోగ్య’ను తెలుగులో చూస్తారా ?

Published on Jul 10, 2019 7:06 am IST

విశాల్ హీరోగా వెంకట్ మోహన్ దర్శకత్వంలో రూపొందిన తమిళ సినిమా ‘అయోగ్య’. తెలుగులో పూరి, ఎన్టీఆర్ చేసిన ‘టెంపర్’ చిత్రానికి ఇది రీమేక్. తమిళంలో మంచి విజయాన్నే అందుకుంది. ఇంతవరకు బాగానే ఉన్నా ఈ రీమేక్ చిత్రం ఇప్పుడు తెలుగులోకి డబ్ కానుండటం ఒకింత ఆశ్చర్యాన్ని,
అయోమయాన్ని కలిగిస్తోంది.

ఆల్రెడీ తెలుగులో వచ్చిన సినిమానే తమిళంలోకి రీమేక్ చేసి మళ్లీ దాన్నే తెలుగులోకి డబ్ చేస్తే ఇక్కడి జనాలు చూస్తారా అనేదే అతి పెద్ద ప్రశ్న. తమిళ రీమేక్ కోసం సినిమాలోని కొన్ని అంశాలను మార్చి ఉండొచ్చు.. అవి తెలుగు వెర్షన్ కంటే బాగానే ఉండి ఉండవచ్చు.. అంతమాత్రాన తెలుగు ప్రేక్షకులు చూసిన సినిమానే మళ్లీ చూస్తారని ఖచ్చితంగా చెప్పలేం. పైగా విశాల్ ఇక్కడ పెద్ద స్టార్ హీరో కూడా కాదు. కంటెంట్ బాగున్న ఆయన స్ట్రైట్ డబ్ సినిమాలకే తెలుగులో ఆదరణ అంతంతమాత్రమే. అలాంటిది ఏ ధైర్యంతో సదరు నిర్మాత ఇప్పటికే ఇక్కడి ప్రేక్షకులు చూసేసిన చిత్రాన్ని మళ్లీ వాళ్లకు చూపాలనుకుంటున్నారో మరి.

సంబంధిత సమాచారం :

X
More