స్టార్ హీరోల రెమ్యూనరేషన్స్ లో 50శాతం కోత.

స్టార్ హీరోల రెమ్యూనరేషన్స్ లో 50శాతం కోత.

Published on Jul 9, 2020 12:01 AM IST


స్టార్ హీరోలకు తమిళ నిర్మాతల నిర్ణయం ఝలక్ ఇవ్వనుంది. రెమ్యూనరేషన్స్ లో ఏకంగా 50 శాతం కోత విధించనున్నట్లు తమిళ నిర్మాతల సంఘం నిర్ణయం తీసుకుంది. అలాగే దర్శకులు మరియు ఇతర సాంకేతిక నిపుణులకు కూడా ఈ సూత్రం వర్తిస్తుంది. ఒక మూవీ బడ్జెట్ లో హీరో మరియు దర్శకుడు రెమ్యూనరేషన్ 40 నుండి 50 శాతం వరకు ఉంటుంది. కరోనా కారణంగా ఏర్పడిన గడ్డు పరిస్థితులనుండి బయట పడాలంటే హీరోలు మరియు దర్శకుల రెమ్యూనరేషన్స్ లో కోత విధించడమే సరైనదిగా వారు భావిస్తున్నారు.

ఇప్పటికే అనేక మంది నిర్మాతలు కరోనా లాక్ డౌన్ వలన దివాళా తీశారు. కొన్ని చిత్రాలు చిత్రీకరణ దశలో ఆగిపోగా, కొన్ని సినిమాలు పూర్తి అయినా విడుదలకు నోచుకోలేని పరిస్థితి నెలకొని ఉంది. దీనితో నిర్మాతల పెట్టుబడి స్థంబించి పోయింది. దాని వలన వడ్డీల భారం పెరిగి, నిర్మాణ వ్యయం పెరిగిపోతుంది. అందుకే తమిళ నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నారు. రజిని, కమల్, విజయ్, అజిత్, విక్రమ్, సూర్య వంటి స్టార్ హీరోల తమ రెమ్యూనరేషన్ కోల్పోనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు