‘అయోగ్య’ విడుదల తేదీ ఫిక్స్ !

‘అయోగ్య’ విడుదల తేదీ ఫిక్స్ !

Published on Mar 7, 2019 12:06 AM IST

ఎన్టీఆర్ ను హిట్ ట్రాక్ ఎక్కించిన ‘టెంపర్’ చిత్రం తమిళ్ రీమేక్ లో విశాల్ మరియు రాశి ఖన్నా హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘అయోగ్య’ టైటిల్ తో రాబోతున్న ఈ సినిమా విడుదల తేదీను ప్రకటించింది చిత్రబృందం. ఏప్రిల్ 19వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. కాగా అయోగ్య థియేట్రికల్ రైట్స్ ను స్క్రీన్ సీన్ సంస్థ దక్కించుకుంది.

ఇక ఇప్పటికే విడుదల అయిన టీజర్ ట్రైలర్ లో మూవీ కాన్సెప్ట్ తో పాటు విశాల్ కూడా బాగా హైలెట్ గా నిలిచాడు. విశాల్ లోని మాస్ ఆటిట్యూడ్ తో పాటు యాక్షన్ అంశాలను సినిమాలో బాగా ఎలివేట్ చేశారట. మరి తెలుగు మరియు హిందీలోలాగే… తమిళ్ లో కూడా ఈ చిత్రం సూపర్ హిట్ అవుతుందేమో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు