వైఎస్. జగన్ గా కనిపించబోతున్న స్టార్ హీరో ?

Published on Jul 25, 2018 11:46 am IST

దివంగత వైఎస్.రాజశేఖర్ రెడ్డిగారి బయోపిక్ ను ‘యాత్ర’ పేరుతో మహి.వి.రాఘవ్ తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. వైఎస్సార్ పాత్రను మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి పోషిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మరోక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ తెలిసింది. వైఎస్. జగన్ పాత్రలో తమిళ్ స్టార్ హీరో కార్తీ నటిస్తున్నారట. సూర్యకు, జగన్ కు మధ్య మంచి అనుబంధం ఉన్న విషయం తెలిసిందే. ఆ అనుబంధం కారణంగానే కార్తీ యాత్ర చిత్రంలో నటించడానికి అంగీకరించారని సమాచారం. ఐతే ఈ వార్తకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

కాగా వైఎస్సార్ తండ్రి రాజారెడ్డిగారి పాత్రలో జగపతిబాబు కనిపించనున్నారు. అలాగే సుహాసిని, పోసాని కృష్ణ మురళి, రావు రమేష్ లతో పాటు రంగస్థలం చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న అనసూయ కూడా ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. 70 ఎం ఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని విజ‌య్ చిల్లా, శశిదేవి రెడ్డిలు నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :